బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (21:51 IST)

ప్రచారం కోసం యువతి బుగ్గపై ముద్దుపెట్టిన బీజేపీ అభ్యర్థి.. ఎక్కడ?

Bjp candidate khagen murmu
Bjp candidate khagen murmu
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నార్త్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కాకెన్ ముర్ము వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుపై నిల్చున్న యువతికి ముద్దు పెట్టడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మాల్టా నార్త్ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన మళ్లీ అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో బీజేపీపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడే బీజేపీ నేతల పనిపట్టండి అంటూ విపక్షాలతో పాటు నెటిజన్లు కూడా సూచిస్తున్నారు.