1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:36 IST)

భార్యను హత్య చేసి.. నరికిన తలతో రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. ఎక్కడ?

crime
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లో వ్యక్తి తన భార్యను చంపి, ఆమె నరికిన తలతో ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
 
నిందితుడిని 40 ఏళ్ల గౌతం గుచ్చైత్‌గా గుర్తించారు. చిస్తీపూర్ బస్టాప్ దగ్గర రక్తంలో తడిసి, నరికిన తన భార్య తలను తీసుకుని వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. ఈ దృశ్యం స్థానికులలో భయాందోళనలకు దారితీసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆపై వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు ప్రాథమిక విచారణలో గుచ్చైత్‌ మానసికంగా అస్థిరతతో ఉన్నారని, కుటుంబ కలహాలతోనే భార్యను హత్య చేసినట్లుగా తేలింది. ఆ తర్వాత నిందితుడు పదునైన ఆయుధంతో ఆమె తలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు.