శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:02 IST)

ప్లేటులో దూబే కాళ్లు కడిగి.. ఆ నీటి తాగి తలపై చల్లుకున్నాడు..

బీజేపీ నేతల నోటి దురుసుతో వివాదాలు కొనితెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్ దుబే ఆదివారం ఓ

బీజేపీ నేతల నోటి దురుసుతో వివాదాలు కొనితెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్ దుబే ఆదివారం ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగానికి అనంతం పవన్ అనే బీజేపీ కార్యకర్త ఓ ప్లేటు, లోటాలో నీళ్లు తీసుకుని ఎంపీ కాళ్ల వద్ద కూర్చున్నాడు. 
 
ప్లేటులో దూబే కాళ్లు కడిగి, తువాలుతో పాదాలు శుభ్రంగా తుడిచాడు. పాదాలు కడిగిన నీటిని తాగి తలపై చల్లుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా ''పవన్ భాయ్ జిందాబాద్'' అని నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోను నిశికాంత్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ఓ ఎంపీ అయివుండి ఓ కార్యకర్తతో అలా చేయించడం ఏమిటని ఫైర్ అవుతున్నారు. కాళ్లు కడిగిన నీళ్లు తాగుతుంటే ఏం చేస్తున్నావంటూ నిప్పులు చెరిగారు. ఓ కార్యకర్త తెలిసో తెలియకో అలా చేస్తే, సర్ధి చెప్పాల్సింది పోయి, ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారా అంటూ నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. దీంతో వెంటనే తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి ఆ వీడియోను నిశికాంత్‌ తొలగించారు.