శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (10:37 IST)

బీజేపీ ఎమ్మెల్యే తల తెగనరికితే రూ.50 లక్షల ప్రైజ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సాధనా సింగ్. ఈమె ఇటీవల బీఎస్పీ అధినేత్రి మాయావతిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మాయావతి ఆడనా.. మగనా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో సాధనా సింగ్‌పై బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే విజయ్ యాదవ్ ఘాటుగా విమర్శలు సంధించారు. అంతా.. తమ పార్టీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధనా సింగ్ తల తెగనరికి తెచ్చినవారికి రూ.50 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.