ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (11:53 IST)

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. ఎరువులపై రాయితీ

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం బస్తాకు రూ.700 రాయితీని పెంచింది. వ్యవసాయంలో అధిక శాతం వాడే డై అమ్మోనియా ఫాస్పేట్‌ డీఏపీపై పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. గత నెల ప్రధాని మోడీ డీఏపీపై 140 శాతం రాయితీని పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశంలో యూరియాపై రూ. 500 నుంచి రూ.1200 పెంచింది.
 
దీనివల్ల ఇప్పటి వరకు రూ.2400కు లభించిన డీపీఏ ఇక నుంచి రూ.1200 కే రైతులకు అందుబాటులో ఉండనుంది. డీఏపీ వల్ల రైతులకు ఎక్కువ మారిందని గ్రహించిన కేంద్రం రాబోవు ఖరీఫ్‌ సీజన్‌ వరకు గరిష్టంగా డీఏపీ రీటైల్‌ ధరలను గత సంవత్సరం ధరల మాదిరి అందుబాటులో పెట్టనుంది. 
 
కొన్ని కంపెనీలు డీఏపీ ధరలను పెంచినా.. కేంద్రం ఆ ధరలను తగ్గించి రైతులకు అందుబాటులోకి తేనుంది. కోవిడ్‌ ప్యాకేజీలో భాగంగానే రైతులపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి, అప్పుడు ధరలను మరోసారి నిర్ణయిస్తామని తెలిపింది.