ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (15:37 IST)

ఆ జిల్లా కలెక్టర్ ఏం చేశారో తెలుసా...?

అంతా మనుషులమే. కాకపోతే చదువు, డబ్బును బట్టి హోదాలు మారుతూ ఉంటాయి. ఉన్నత చదువులు చదుకున్నవారు ఏ కలెక్టరో, డాక్టరో... ఇలా మంచిమంచి స్థానాల్లో స్థిరపడతారు. ఐతే అలాంటివారిలో పదవులు వచ్చినా తాము సామాన్య మా

అంతా మనుషులమే. కాకపోతే చదువు, డబ్బును బట్టి హోదాలు మారుతూ ఉంటాయి. ఉన్నత చదువులు చదుకున్నవారు ఏ కలెక్టరో, డాక్టరో... ఇలా మంచిమంచి స్థానాల్లో స్థిరపడతారు. ఐతే అలాంటివారిలో పదవులు వచ్చినా తాము సామాన్య మానవుల్లో ఒకరిమే అని అనుకోవడమే కాదు చేసి చూపిస్తుంటారు కూడా. ఇలాంటిదే ఒకటి జరిగింది. అదేంటయా అంటే... ఆకోలా ప్రాంతానికి కలెకర్ట్ అయిన శ్రీకాంత్ అందరినీ ఆకట్టుకునే పని చేశారు.
 
తన డ్రైవర్ దిగంబర్ థక్ పదవీ విరమణ చేసే రోజు ఆయన చేసిన దానికి పొగడ్తలు వర్షం కురుస్తోంది. దిగంబర్ తన కెరీర్లో 18 మంది కలెక్టర్లకు డ్రైవరుగా విధులు నిర్వహించారు. కలెక్టర్ శ్రీకాంత్ పదవిలో సాగుతుండగా తనకు 58 ఏళ్లు నిండటంతో పదవీ విరమణ చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఐతే తన జీవితంలో ఎలాంటి తప్పు చేయకుండా కలెక్టర్లందరీ వద్ద చాలా నిజాయితీగా పని చేసిన దిగంబర్ ను ప్రత్యేకంగా సత్కరించాలని నిశ్చయించుకున్నారు శ్రీకాంత్. 
 
అనుకున్నదే తడవుగా తనకు ప్రభుత్వం కేటాయించిన కారుకు పుష్పాలు అతికించి డెకరేట్ చేయించారు. తనే కారును డ్రైవ్ చేసుకుంటూ డ్రైవరు దిగంబర్ ఇంటికి వెళ్లి ఆయనను తన కారు వెనుక సీటులో కూర్చోమన్నారు. ఆయన కారులో ఎక్కి కూర్చోగానే కలెక్టర్ శ్రీకాంత్ డ్రైవరు సీటులో కూర్చుని కారు నడుపుకుంటూ కార్యాలయానికి తీసుకువచ్చి, దిగంబర్ కు ఘన సన్మానం చేశారు. ఈ వార్త సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో షేర్ అవుతోంది.