మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (08:15 IST)

ఢిల్లీ పోలీసుల దెబ్బకు వణికిపోతున్న పోలీసులు.. 20 మంది అజ్ఞాతంలోకి...

ఢిల్లీ పోలీసుల దెబ్బకు తమిళనాడు మంత్రులు వణికిపోతున్నారు. వారి ఎపుడు ఎలాంటి చెడు సమాచారం వినాల్సి వస్తుందేమోనన్న భయంతో వారు అజ్ఞాతంలోకి జారుకున్నారు. రెండాకుల గుర్తు వ్యవహారంలో ఎన్నికల సంఘానికి లంచం ఇ

ఢిల్లీ పోలీసుల దెబ్బకు తమిళనాడు మంత్రులు వణికిపోతున్నారు. వారి ఎపుడు ఎలాంటి చెడు సమాచారం వినాల్సి వస్తుందేమోనన్న భయంతో వారు అజ్ఞాతంలోకి జారుకున్నారు. రెండాకుల గుర్తు వ్యవహారంలో ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో... అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఇందుకోసం మొత్తం రూ.60 కోట్లకు డీల్ కుదరగా, రూ.10 కోట్లు సేకరించి తన ఏజెంట్ సుఖేష్ చంద్రశేకర్ ద్వారా ఢిల్లీకి పంపించారు. ఈ డబ్బుతో సహా సుకేష్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అటు సుకేష్, ఇటు దినకరన్‌ల వద్ద సేకరించిన వివరాలతో ఈ డబ్బును పలువురు మంత్రులు సేకరించి ఇచ్చినట్టు తేలింది. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు... ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మంత్రులకు కూడా సమన్లు జారీ చేయాలని భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఈసీ ఇవ్వజూపిన లంచం డబ్బును మంత్రులే సమకూర్చినట్టు దినకరన్‌ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఇందులోభాగంగా, రూ.10 కోట్ల నగదును ఎవరు ఇచ్చారు? ఎలా తరలించారు? అన్న విషయాలను రాబట్టారు. మిగతా డబ్బు ఎలా వచ్చిందన్న విషయమై విచారణ సాగుతుండగా, ఏ రోజు ఎవరి పేరును బయటకు తెచ్చి ఇబ్బందులు పెడతారోనన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమవుతోంది.
 
ఈనేపథ్యంలో ఇప్పటికే 20 మంది మంత్రులు చెన్నై నగరాన్ని వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ కేసు తమ మెడకు చుట్టుకుంటుందోనన్న భయం వీరిలో నెలకొని ఉందని తెలుస్తోంది. కేసు విచారణలో భాగంగా రూ.50 కోట్లను ఎలా సేకరించారన్న విషయంపైనే ఢిల్లీ పోలీసులు ప్రధానంగా దృష్టిని సారించినట్టు సమాచారం. 
 
ఇక దినకరన్, సుకేష్, నరేష్‌లను విచారించిన పోలీసులు, ఆపై దినకరన్‌ను మూడు రోజుల పాటు చెన్నై తీసుకువచ్చి కూడా విచారించారు. కేసులో తగిన ఆధారాలు సేకరించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు, త్వరలోనే మంత్రులకూ సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.