కావేరీ ఎఫెక్ట్ : తమిళనాడులో కొనసాగుతున్న బంద్.. విజయ్‌కాంత్ నిరాహార దీక్ష
కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాన్ని కన్నడ ప్రజలు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనలు చేశారు. తమిళనాడుకు చెందిన వాహనాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. తమిళులను కొట్టి గాయపరిచారు. ఈ చర్యలకు నిరసనగా శ
కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాన్ని కన్నడ ప్రజలు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనలు చేశారు. తమిళనాడుకు చెందిన వాహనాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. తమిళులను కొట్టి గాయపరిచారు. ఈ చర్యలకు నిరసనగా శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా బంద్ జరుగుతోంది.
వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతోపాటు సినీ పరిశ్రమ కూడా మద్దతు తెలిపింది. సినీ ప్రముఖులు షూటింగులను నిలిపివేశారు. ఇక పార్టీ కార్యాలయంలో డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్ నిరాహారదీక్ష చేపట్టారు. కాగా, ఈ బంద్‌కు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు... వ్యాపార, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఇదిలావుండగా, కావేరి జలాల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై స్పందించింది. ప్రజాందోళనలు, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది.
ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని వ్యాఖ్యానించింది. ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కావేరి జలాల అంశంలో తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.