గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (15:36 IST)

శశికళ జైలుకెళ్లారు... ఇక ఆమె భర్త నటరాజన్ వంతు.. లెక్సస్‌ కారు కేసు విచారణ వేగం

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లారు. మరో నాలుగేళ్ల పాటు ఆమె జైలుశిక్ష అనుభవించి తీరాల్సిందే. అలాగే, పదేళ్ళ పాటు రాజకీయాల్లో పోటీ చేసేందుకు అనర్హురాలు. అలా శశికళ కథ రాజకీయ కథ ముగిసింది.

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లారు. మరో నాలుగేళ్ల పాటు ఆమె జైలుశిక్ష అనుభవించి తీరాల్సిందే. అలాగే, పదేళ్ళ పాటు రాజకీయాల్లో పోటీ చేసేందుకు అనర్హురాలు. అలా శశికళ కథ రాజకీయ కథ ముగిసింది. ఇపుడు ఆమె భర్త వంత వచ్చింది. ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నటరాజన్... జయలలిత ఆగ్రహించి ఆయనను పోయెస్ గార్డెన్ నుంచే కాకుండా పార్టీ నుంచి దూరంగా పెట్టారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 
 
కానీ, జయలలిత మరణానంతరం ఒక్కసారి మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకు కేసుల గండం పట్టుకుంది. సీబీఐ అధికారులు ఆయనపై గతంలో నమోదు చేసిన కేసులు తిరగదోడుతున్నారు. మద్రాసు కోర్టులో ఈ కేసు ఇప్పుడు వేగం పుంజుకుంది. 1994లో లెక్సస్‌ కార్ల దిగుమతికి సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లు నటరాజన్‌ మరో ముగ్గురుపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.
 
ఈ కేసు విషయంలో గత ఐదేళ్లుగా అప్పీళ్లతో నటరాజన్‌ ముందుకెళుతూ ఉన్నారు. అయితే, ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఇటీవల మద్రాసు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సీబీఐకి మెమోలు పంపించారు. దీంతో ఈ కేసు చివరి విచారణ ఈ నెల 27న జస్టిస్‌ ఎస్‌.భాస్కరన్‌ ధర్మాసనం ముందు జరగనుంది. 
 
1994లో తీసుకొచ్చిన లెక్సస్‌ కార్లను 1993 మోడల్‌గా ఫేక్‌ డాక్యుమెంట్లు చూపించి, అప్పటికే వాడిన కార్లుగా చూపించారు. ఇవి నకిలీ పత్రాలుగా తేలడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ఇకపై త్వరితగతిన పూర్తికానుంది.