శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 22 జులై 2020 (18:06 IST)

పాఠశాలలు ప్రారంభంపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

కరోనావైరస్ విద్యార్థుల చదువులపై తన ప్రతాపాన్ని చూపింది. దీంతో విద్యార్థుల చదువులు ఇళ్లకే పరిమితమయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి విద్యార్థులు పాఠశాలల్లో బిజిబిజీగా ఉండేవాళ్లు. కాని కరోనా ప్రభావంతో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
 
ఈ నేపధ్యంలో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. పాఠశాలల పునఃప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలను సేకరించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ తీసుకొని తమకు పంపించాలని కోరింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఏది తమకు అనువుగా ఉన్నదో అడిగి తెలుసుకోమని సూచనలిచ్చింది.