కరోనా మనల్ని వదిలిపోయే పరిస్థితి లేదు.. కేటీఆర్

ktramarao
ktramarao
సెల్వి| Last Updated: సోమవారం, 13 జులై 2020 (19:54 IST)
ప్రపంచ దేశాలను కరోనా అట్టుడికిస్తోంది. మనదేశంలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు అర్థరహితమని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా సమస్య ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు.

జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని కేటీఆర్ అన్నారు. కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు అర్థరహితమని కేటీఆర్ అన్నారు.

కరోనా విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉందని... అలాంటప్పుడు ఈ విషయంలో ప్రధాని మోదీ కరోనా కట్టడిలో ఫెయిలయ్యారని అనుకోవాలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. క్లిష్ట సమయంలో ఒకరినొకరు విమర్శించుకోవడం సరికాదని కేటీఆర్ సూచించారు. కరోనా సంక్షోభ సమయంలో మంత్రి ఈటల రాజేందర్ ఎంతో గొప్పగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.దీనిపై మరింత చదవండి :