మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (09:52 IST)

ప్రణబ్‌కు మొహం చాటేసిన కేంద్ర మంత్రులు : రాష్ట్రపతి ఇఫ్తార్ విందుకు డుమ్మా

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర మంత్రులు మొహం చాటేశారు. అదీకూడా ప్రణబ్ ఇంకా పదవిలో ఉండగానే. రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఒక్కరంటే ఒక్క కేంద్రమంత్రి కూడా హాజరుకాలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర మంత్రులు మొహం చాటేశారు. అదీకూడా ప్రణబ్ ఇంకా పదవిలో ఉండగానే. రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఒక్కరంటే ఒక్క కేంద్రమంత్రి కూడా హాజరుకాలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే కేంద్రం పూర్తి నిర్లక్ష్య ధోరణిని అవలంభించింది. 
 
శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు కేంద్ర మంత్రులంతా డుమ్మా కొట్టారు. రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానాలు పంపినా కనీసం ఒక్క మంత్రి కూడా రాలేదు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో పాటు ప్రణబ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే పశ్చిమబెంగాల్‌కు చెందిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ కూడా మొహం చాటేశారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ ఐదేళ్ల పదవీకాలంలో ఇలా జరగడమిదే తొలిసారి.