గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (22:24 IST)

ఆ రైలులో ఏసీ కోచ్‌లో అది పనిచేయలేదు.. ఊపిరి పీల్చుకోవడానికి..?

brindhavan Express
brindhavan Express
చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న బృందావన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జనరేటర్ పనిచేయకపోవడంతో ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఏసీలు మొరాయించాయి. దీంతో రెండు గంటలపాటు రైలు నిలిచిపోయింది. ఫలితంగా ప్రయాణీకులు ఊపిరి పీల్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు.  
 
బృందావన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ చెన్నై నుండి బయలుదేరి బెంగళూరు చేరుకుంటుంది. జొల్లార్‌పేట మీదుగా వెళ్లే ఈ రైలు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఏపీ కంపార్ట్‌మెంట్ పూర్తిగా ముందుగానే బుక్ చేయబడి ఉంటుంది.
 
ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి.. బృందావన్ ఎక్స్‌ప్రెస్‌లో జనరేటర్ పనిచేయకపోవడంతో ఏసీ కంపార్ట్‌మెంట్ పనిచేయలేదు. దీంతో కంపార్ట్‌మెంట్ నుంచి బయటి గాలి లోపలికి రాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేకపోయారు.
 
ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు మెకానికల్ విభాగం జనరేటర్‌ను బాగు చేసింది. దీంతో రెండు గంటల తర్వాత ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా రైలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.