శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:43 IST)

మహిళ ముక్కులోకెళ్లిన బొద్దింక... ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా ముక్కులోకి చిన్నపాటి దోమ వెళ్లినా బహు చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఏకంగా బొద్దింక వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కానీ, చెన్నైకు చెందిన ఓ మహిళ ముక్కులోకి ఓ బొద్దింక దూరింది.

సాధారణంగా ముక్కులోకి చిన్నపాటి దోమ వెళ్లినా బహు చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఏకంగా బొద్దింక వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కానీ, చెన్నైకు చెందిన ఓ మహిళ ముక్కులోకి ఓ బొద్దింక దూరింది. అది ముక్కు రంధ్రం గుండా ఏకంగా నేత్రాల వరకు వెళ్లిపోయింది. దీంతో ఆమె నరకయాతన అనుభవించింది. దీన్ని 12 గంటల పాటు పోరాటం చేసి వెలికి తీశారు వైద్యులు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నైలోని ఇంజంబాకం ప్రాంతానికి చెందిన సెల్వి (42) అనే మహిళ మంగళవారం రాత్రి నిద్రపోతుండగా, ఉన్నట్టుండి ఆమె ముక్కులో ఏదో దురద పుట్టినట్లనిపించి నిద్రలేచింది. జలుబు వల్ల అలా అయి ఉంటుందనుకుని.. మళ్లీ నిద్రలోకి జారుకుంది. అయితే, ముక్కు తీవ్రంగా ఇబ్బంది పెడుతుండటంతో ఏదో ఉందని భావించింది. వెంటనే ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ముక్కు లోపల ఏదో పెరిగి ఉంటుందనుకున్నారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముక్కులోకి నీటిని పంప్ చేసి బయటకు తీద్దామనుకున్నారు. కానీ, అది సాధ్యపడలేదు. దీంతో మరో ఆస్పత్రికి వెళ్లగా, ఏదో కదులుతున్న వస్తువు ఉందని చెప్పి, స్కాన్ చేయాలన్నారు.
 
బుధవారం తెల్లవారేసరికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో స్టాన్లీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగానికి ఆమెను తరలించారు. అక్కడి వైద్యులు ముక్కుకు ఎండోస్కొపీ చేసి చూడగా.. రెండు యాంటెన్నాల లాంటివి కనిపించాయి. అది పెద్ద బొద్దింకేనని ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ ఎంఎన్ శంకర్ చెప్పారు. ఎట్టకేలకు వాళ్లు ఒక సక్షన్, ఫోర్‌సెప్స్ ఉపయోగించి ఆ బొద్దింకను బయటకు లాగారు. అలా దాన్ని బయటకు తీసేందుకు 45 నిమిషాల సమయం పట్టింది. ఇంతకూ ఆ బొద్దింక బయటకు తీసేంతవరకు ప్రాణాలతో ఉండటం గమనార్హం.