మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (15:02 IST)

బాలికపై అత్యాచారం.. శుద్ధీకరణ పేరుతో అరగుండు (వీడియో)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అసలే అత్యాచారానికి గురై కుంగిపోయిన బాధితురాలికి శుద్ధీకరణ పేరుతో అరగుండు గీయించి.. గ్రామ బహిష్కరణ చేశారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అసలే అత్యాచారానికి గురై కుంగిపోయిన బాధితురాలికి శుద్ధీకరణ పేరుతో అరగుండు గీయించి.. గ్రామ బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని కవర్ధా జిల్లాలో ఓ 13 యేళ్ళ వయసున్న బాలికపై అర్జున్ యాదవ్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. దీంతో బాధితురాలిని పంచాయితీకి పిలిపించి... శుద్ధీక‌ర‌ణ పేరుతో పంచాయ‌తీ పెద్దలు అర‌గుండు గీయించారు. 
 
అంతేనా, ఆ బాలికతో ఎవ్వరూ మాట్లాడవద్దని, ఆమె గ్రామ ప్రజలకు దూరంగా ఉండాలని బహిష్కరించారు. కానీ, ఆమెపై అత్యాచారం చేసిన అర్జున్ యాదవ్‌కు మాత్రం ఎలాంటి శిక్ష విధించకపోగా, గ్రామంలో స్వేచ్ఛగా తిరిగేలా తీర్పునిచ్చారు. 
 
ఈ విషయం జిల్లా పోలీసులకు తెలియడంత నిందితుడు అర్జున్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఆ బాలికను బహిష్కరించని పంచాయతీ సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.