మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:45 IST)

ప్రియుడి కంటిముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. మనస్తాపంతో?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కటోహోరా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్ సాయి (21), ఓ మైనర్ బాలిక (17) ప్రేమలో వున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరూ ఓ పాఠశాల వద్ద కూర్చుని వుండగా.. ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు వచ్చి సాయితో గొడవకు దిగారు. ఆపై సవాన్‌ను  కొట్టి, బాలికపై అత్యాచారం చేశారు. ఆపై తాము రేప్ చేశామని వారిద్దరూ గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. 
 
దీన్ని అవమానంగా భావించిన సాయి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ రేప్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈశ్వర్, కన్వర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.