మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (11:20 IST)

ఐదింటిలో మూడు కాంగ్రెస్ ఖాతాలోనే.. ఆ మూడు బీజేపీ కంచుకోటలే...

ఈ యేడాది ఆఖరులో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించనుంది. ఈ మూడు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోనివి కావడం గమనార్హం. కొద్దినెలల్లో రాజస్థా

ఈ యేడాది ఆఖరులో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించనుంది. ఈ మూడు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోనివి కావడం గమనార్హం. కొద్దినెలల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
 
ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏబీపీ - సీ ఓటర్‌ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో బీజేపీ పాలిత హిందీ బెల్ట్‌ రాష్ట్రాలు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌‌‌గఢ్‌ రాష్ట్రాలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగిస్తుందని ఈ సర్వే తేల్చింది. రాజస్థాన్‌లో 200 సీట్లకు గాను 130 స్థానాలు, ఛత్తీగఢ్‌లో 90 స్థానాలకు గాను 54 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకు గాను 117 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వే జోస్యం చెప్పింది. 
 
ఒక్క మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించవచ్చని, అయినప్పటికీ అధికారం చేపట్టే అవకాశాల్లేవని ప్రజల నాడి బట్టి తెలుస్తోందని పేర్కొంది. నాలుగు నెలల కిందట ఇదే గ్రూపు జరిపిన సర్వే మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోతుందని, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది.