గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:05 IST)

మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తిరిగి ప్రారంభించేందుకు 'డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆప్‌ ఇండియా (డిసిజిఐ) అనుమతించింది. ఇటీవల బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ చేపట్టిన ట్రయల్స్‌లో భాగంగా ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా ప్రయోగాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అదే విధంగా వివిధ దేశాల్లోనూ తన ప్రయోగాలను నిలిపివేసింది. ఆందులో భాగంగా భారత్‌లోనూ ప్రయోగాలను నిలిపివేయాలని డిసిజిఐ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇటీవల బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తమ ప్రయోగాలను పున:ప్రారంభించింది.

దీంతో భారత్‌లోనూ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు డిసిజిఐ డాక్టర్‌ విజి.సోమాజీ అనుమతించారు. తమ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. అయితే అత్యంత జాగ్రత్తతో ఈ ట్రయల్స్‌ను కొనసాగించాలని ఆదేశించారు. స్క్రీనింగ్‌ దశలోనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే వాటిపై లోతైన అధ్యయనం చేయాలని ఈ ప్రయోగాలను చేపట్టిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఆదేశించారు. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తితే నివేదికను డిసిజిఐ కారాలయానికి సమర్పించాలని కోరారు.