గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (14:19 IST)

ఢిల్లీలో ప్రతి 10 మంది డ్రైవర్లలో ముగ్గురు అంధులేనట...

దేశ రాజధాని ఢిల్లీలోని డ్రైవర్లలో 30 శాతం మంది అంధులేనట. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. హస్తినలో వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్రమైన దృష్టిదోషంతో బాధపడుతు

దేశ రాజధాని ఢిల్లీలోని డ్రైవర్లలో 30 శాతం మంది అంధులేనట. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. హస్తినలో వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్రమైన దృష్టిదోషంతో బాధపడుతున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. 
 
ఇక్కడ ఉన్న డ్రైవర్లలో ప్రతి మందిలో ముగ్గురు అంటే ఢిల్లీలో వాహనాలు నడిపై డ్రైవర్లలో 30 శాతం మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారని తేలింది. 627 ప్రైవేటు కార్లు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు నడిపే డ్రైవర్లలో 19 శాతం మందికి తీవ్ర వర్ణ అంధత్వం (కలర్ బ్రైండ్‌‌నెస్) ఉందని పేర్కొంది. 
 
మరో 23 శాతం మంది డ్రైవర్లు స్వల్ప వర్ణ అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. అంతేకాకుండా ఈ దృష్టిదోషంతోనే ఢిల్లీలోని వాహనాల్లో 29 శాతం వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 10 గంటల పాటు నడుపుతున్నారని ఈ కారణంగానే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని పరిశోధనా సంస్థ తెలిపింది.