మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (06:01 IST)

కరోనా బెంచీలు వస్తున్నాయ్

ఇక పకపక్కనే కూర్చుని ఊసులాడుకునే రోజులు పోయినట్లేనేమో! .. నువ్వా ద‌రిన... నేనీ ద‌రిన‌..! అంటూ దూరం దూరంగా ఉండి మాట్లాడుకోవాల్సిందేనేమో!..

క‌రోనా వైర‌స్ వ్యాప్దిని నియంత్రించేందుకుగాను ప్ర‌తిదీ మ‌నం మార్చుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. సోపాలు, బ‌ల్ల‌లు వంటివాటిపై ముగ్గురు, న‌లుగురు కూర్చోవ‌డం ఇప్ప‌టివ‌ర‌కు ఆన‌వాయితీగా ఉండ‌గా ఇక‌పై భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలో ఇలాంటి మార్పులు ‌త‌ప్పవేమోన‌ని అనిపిస్తుంది. పార్కుల్లోనూ, బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనూ ఇలాంటి బ‌ల్ల‌లు రాబోతున్నాయి.