శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:00 IST)

సెలూనుకు వెళ్లిన ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌ మ‌రో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

ఖార్గోన్‌ జిల్లా బార్గావ్‌ గ్రామంలో ఓ కటింగ్‌ షాపునకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవల ఇండోర్‌ నుంచి స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడు ఏప్రిల్‌ 5న ఓ కటింగ్‌ సెలూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇక అదే షాపునకు వెళ్లిన మరో ఆరుగురు గ్రామస్తులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

అయితే బార్బ‌ర్‌ వీరందరికి ఒకే టవల్‌, పనిముట్లు వాడటంతోనే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అయినా కేంద్ర ప్రభుత్వం సెలోన్లకు, బార్లకు, వైన్ షాపులు తీయోద్దని స్పష్టమయిన  ఆదేశాలిచ్చింది. 
 
బాపట్లలో దొంగచాటుగా కొంతమంది బార్బర్లు షట్టర్లు వేసి మరీ కస్టమర్లకు షేవింగ్, కటింగ్ చేస్తున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. 
 
మధ్య ప్రదేశ్ లో సెలోన్ లో 6 గురికి కరోనా వచ్చిన నేపథ్యంలో ఎపీలో  అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా ఎవరైనా సెలోన్లు తెరిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.