సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జులై 2020 (11:50 IST)

24 గంటల్లో 24,248 కరోనా కేసులు.. రష్యాను దాటిసేందిగా..!

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 24,248 కొత్త కరోనా కేసులు నమోదైనాయి. ఇంకా 425 మంది మృతి చెందారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ మొత్తం రోగుల సంఖ్య 6 లక్షల 97 వేల 413. వీరిలో 19 వేల 693 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇప్పటివరకు 4 లక్షల 24 వేల 433 మంది కోలుకున్నారు. 
 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపిన ప్రకారం జూలై 5 వరకు మొత్తం 99 లక్షల 69 వేల 662 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా కరోనా కేసుల విషయంలో భారత్ రష్యాను దాటింది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య ఒక లక్షా 11 వేలు దాటింది. దేశ రాజధానిలో కరోనా రోగులు లక్షకు చేరుకున్నారు.