ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (14:01 IST)

టిక్‌టాక్ తరహాలో షేర్ చాట్ నుంచి ''మోజ్'' యాప్

Moj
భారత్‌లో చైనాకు చెందిన 59 యాప్‌లు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఇందులో టిక్‌టాక్ కూడా ఒకటి. భారతీయులకు టిక్ టాక్ మోజు అంతా ఇంతా కాదు. ఈ మోజునే దేశీయ యాప్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి. టిక్‌టాక్‌కు ఉన్న మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు టిక్‌టాక్‌ ఫీచర్స్‌తో ఉన్న యాప్‌లు కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. చైనా యాప్‌ల నేషేధం ఫలితంగా భారతీయ యాప్‌లకు ప్రాముఖ్యత పెరుగుతోంది.
 
భారత్‌కి చెందిన షేర్‌చాట్ కూడా తాజాగా 'మోజ్' పేరుతో అటువంటి యాప్‌నే లాంచ్ చేసింది. ఈ యాప్‌లో కూడా టిక్‌టాక్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉన్నాయి. చింగారి యాప్ కూడా టిక్‌టాక్ నిషేధించిన తర్వాత మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇదే తరహాలో చాలామంది ఈ మోజ్ యాప్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. 
 
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న మోజ్ యాప్‌లో 15 భాషలు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల్లోనే 50 వేల మంది మోజ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మోజ్ యాప్‌కి 4.3 రేటింగ్ కూడా ఇచ్చారు. ఈ యాప్‌లో 15 సెకన్ల వీడియోలను సైతం క్రియేట్ చేసే సదుపాయం వుంటుంది. టిక్‌టాక్‌ తరహాలోనే మోజ్‌లో కూడా లిప్-సింక్ ఫీచర్ ఉంది.