బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (20:43 IST)

ఇండియాలో కరోనా: 44 రోజుల తర్వాత రెండు లక్షల దిగువకు కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 44 రోజుల తర్వాత రెండు లక్షల దిగువకు రోజువారీ కేసులు చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 1,86,364 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 3,660 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 20.57 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 23,43,152గా ఉంది. రికవరి రేటు 90.34 శాతం కాగా యాక్టివ్ కేసులు 8.51 శాతంగా ఉంది.
 
ఇక దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. 18-44 మధ్య వయస్సున్న 12,52,320 మందికి సోమవారం మొదటి డోసు వేసినట్లు కేంద్రం వెల్లడించింది.