శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (11:53 IST)

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా కేసులు.. 24 గంటల్లో 1185 మంది మృతి

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వుంది. రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లిస్ట్‌లో ఉంది. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతుంది. సెకండ్ వేవ్‌లో కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. 
 
ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. ఇందులో 1,25,47,866 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,69,743 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1185 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,74,308కి చేరింది.