నాన్నమ్మపై దాడి చేసిన దంపతులు... భర్త పట్టుకుంటే.. భార్య చెక్కతో..?
ఆధునిక పోకడలతో మానవత్వం మంటగలిసిపోతుంది. తాజాగా భోపాల్‌కు చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జంట వారి నాన్నమ్మపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను గుర్తించిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వృద్ధురాలిని గట్టిగా పట్టుకోవడం చూడవచ్చు, అతని భార్య ఆమెను చెక్కతో కొట్టినట్లు కనిపిస్తుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా, దీపక్ సేన్-పూజా సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందినవారని గుర్తించారు. భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ జంటను అరెస్టు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీపక్ బర్ఖేడీ ప్రాంతంలో బార్బర్ షాప్ నడుపుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.