బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (16:13 IST)

పశ్చిమ బెంగాల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం: కోవిడ్ -19 వృద్ధ రోగి మృతి

పశ్చిమ బెంగాల్ కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో ఓ వృద్ధ కోవిడ్ -19 పేషెంట్ మరణించినట్లు అధికారులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. మృతురాలు, సంధ్యా మోండల్ (60) ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేరారు, అక్కడ తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగాయని వారు తెలిపారు. వార్డులోని ఇతర రోగులను సకాలంలో వేరే విభాగానికి తరలించడంతో వారు సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.