1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:01 IST)

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత..ఎక్కడ?

కర్ణాటకలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించనున్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదించింది.

కరోనా పై పోరాటానికి ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమాకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు. దేశ వ్యాప్తంగా కేంద్రమంత్రులు, ఎంపీల వేతనంలోనూ రెండేళ్ల పాటు 30 శాతం కోత విధిస్తూ ఇటీవలే మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

”మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వేతనాల్లో ఈ నెల నుంచి కోత విధిస్తున్నాం. మొత్తం రూ.15. 36 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయి” అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపామని వేతనాల్లో కోతకు అందరూ అంగీకరించారన్నారు.