శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (18:02 IST)

ఇంట్లోకి వచ్చిన కప్ప.. చంపి పులుసు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

Frog
తమ ఇంట్లోకి ఓ కప్ప రావడాన్ని ఆ కుటుంబ యజమాని జీర్ణించుకోలేకపోయాడు. దీన్ని పట్టుకున్న ఆయన చంపేసి ఏకంగా పులుసు పెట్టేసాడు. ఆ కప్ప కూరను ఆరగించిన ఆరేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాదకర ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో జరిగింది. 
 
జిల్లాలోని జోడా బ్లాక్‌కు చెందిన మున్నా అనే వ్యక్తి ఇంట్లోకి ఓ కప్పవచ్చింది. దీన్ని చూడగానే మున్నాకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో ఆ కప్పను ఆయన చంపేసి, కూర వండాడు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలకు వడ్డించాడు. ఈ కూరను ఆరగించే ఆరేళ్ల చిన్నారి మృత్యువాతపడగా మరో చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈమె ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. 
 
ఈ వార్త తెలుసుకున్న పోలీసులు కియోంజర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని బమేబారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుదా అనే గ్రామానికి వెళ్లి విచారించగా, 40 యేళ్ల గిరిజన తెగకు చెందిన మున్నా అనే వ్యక్తి ఈ పాడు పనికి పాల్పడిన మాట వాస్తవమేనని తేలింది. 
 
కాగా, బాలిక మృతి అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు బామేబేరి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ స్వరూప్ రంజన్ వెల్లడించారు.