శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (18:02 IST)

కార్పొరేషన్ అధికారులపై గేదెలతో దాడి చేయించారు.. పోలీసులను రాళ్లతో కొట్టారు..

మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేషన్ అధికారులు రైడింగ్‌కి వస్తున్నారని తెలిసి 500 గేదెలను వారిపైకి వదిలారు పా

మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేషన్ అధికారులు రైడింగ్‌కి వస్తున్నారని తెలిసి 500 గేదెలను వారిపైకి వదిలారు పాల వ్యాపారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. పరియత్‌ నది ఒడ్డున ఉన్న ఇమ్లియా గ్రామంలో 20 డెయిరీలు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో శనివారం కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. 
 
అధికారులు డైరీల లోపలికి రానీయకుండా షెడ్‌లో కట్టేసిన 500గేదెలను వారిపైకి వదిలారు. గేదెలన్నీ రోడ్డుపైకి రావడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గేదెలను అదుపుచేయడానికి యత్నించే క్రమంలో పలుమార్లు కాల్పులు జరిపారు. దాంతో వ్యాపారులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు పాల వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.