1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:46 IST)

దళిత మహిళను గొడ్డును బాధినట్టు బాది.. ఆపై యూరిన్ తాగించారు!

ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో నాటి భావాలు, ఆలోచనలు జీవన విధానాలు మారుతున్ననేపథ్యంలో కూడా మూడ నమ్మకాలను గ్రామాల ప్రజలు అనుసరిస్తుండడంతో ఎంతో మంది అమాయక ప్రజలు బ‌లవుతున్నారు.

ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో నాటి భావాలు, ఆలోచనలు జీవన విధానాలు మారుతున్ననేపథ్యంలో కూడా మూడ నమ్మకాలను గ్రామాల ప్రజలు అనుసరిస్తుండడంతో ఎంతో మంది అమాయక ప్రజలు బ‌లవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి  బీహార్‌లోని దర్భాంగా జిల్లా పిప్రాలో చోటుచేసుకుంది.

ఆ వివరాలను పరిశీలిస్తే... ఓ దళిత మహిళ పట్ల అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. ఆ దళిత మహిళ గ్రామంలో మంత్రాలు, చేతబడులు చేయడంతో ఊళ్లో చిన్న పిల్లల అనారోగ్యానికి గురయ్యారన్న కోపంతో అదే గ్రామానికి చెందిన ఓ నలుగురు యువకులు... ఆమెను గొడ్డును బాధినట్టు బాది...అంతటితో ఆగిపోకుండా ఆమె చేత మూత్రం తాగించారు.

అ అమానుష ఘటన గురించి సమాచారం అందుకున్నపోలీసులు అందిన వెంటనే గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేసి, ఆ నలుగురి యువకులపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని గ్రామ ప్రజలు అన్నారు.