మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 అక్టోబరు 2018 (15:52 IST)

వివాహేతర సంబంధం.. మామ హెచ్చరించాడని.. కోడలు చంపేసింది..

తన వివాహేతర సంబంధానికి మావయ్య అడ్డుగా వున్నాడని.. హత్య చేసింది.. ఓ వివాహిత. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నెమిలికాల్వలో చోటుచేసుకుంది.

మానవీయ విలువలు రోజు రోజుకీ కనుమరుగవుతున్నాయి. కావాలనుకున్నది దొరకక పోతే.. ఎలాంటి హింసకైనా పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తన వివాహేతర సంబంధానికి మావయ్య అడ్డుగా వున్నాడని.. హత్య చేసింది.. ఓ వివాహిత. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నెమిలికాల్వలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 2018 సెప్టెంబర్ 10వ తేదీన నెమిలికాల్వ గ్రామానికి చెందిన గడ్డం ముత్యాలు హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు గురైన ముత్యాలు కుమారుడు రమేష్‌కు చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన సంతోషతో వివాహమైంది. సంతోష ఉపాధి హామీ కూలీ పనికి వెళ్లేది. ఇదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం శ్రీమన్నారాయణతో సంతోషకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
ఈ వ్యవహారంపై సంతోష మామ ఆమెను హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో పంచాయతీ కూడా పెట్టించాడు. కానీ ఆమె మారకపోవడంతో సంతోషను పుట్టింటికి పంపారు. అయితే సెప్టెంబర్‌లో పండుగ కోసమని అత్తారింటికి వచ్చిన సంతోష.. మామను హత్య చేయాలని పక్కా ప్లాన్ వేసింది. 
 
తన సోదరుడు వెంకటేష్‌తో కలిసి ముత్యాలును హత్య చేసింది. ముత్యాలు మృతిపై అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నారు.