కొరివి పెట్టిన తరువాత పాడె మీద నుంచి లేచిన శవం, పరుగులు తీశారు

deadbody
జె| Last Modified బుధవారం, 16 అక్టోబరు 2019 (17:27 IST)
చనిపోయిన వ్యక్తి బతకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి.. ఒడిస్సా రాష్ట్రం గంజా జిల్లా లావుగా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కొరివి పెట్టే సమయంలో పాడె మీద నుంచి శవం పైకి లేవడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మల్లిక్ మేకలను మేపేందుకు అడవికి వెళ్ళేవాడు. గత రెండు సంవత్సరాలుగా అతను ఇదే పని చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో మల్లిక్ బాధపడ్డాడు. అయినా సరే అటవీ ప్రాంతంలోకి మేకలను తీసుకెళ్ళాడు. రాత్రివేళ అయ్యింది. సాయత్రం 6 గంటలకల్లా ప్రతిరోజు మల్లిక్ ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఎంతకూ రాకపోవడంతో బంధువులు హైరానా పడి అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు.

మల్లిక్ అటవీ ప్రాంతంలో ఓ చోట పడిపోయి ఉన్నాడు. శ్వాస వుందో లేదో అని పరిశీలించారు. అతడు శ్వాస తీసుకోవడంలేదు. దీంతో అతడు చనిపోయాడనుకున్నారు. బంధువులందరినీ పిలిచారు. పాడె సిద్ధం చేసి కుటుంబ సభ్యులందరూ స్మశాన వాటికకు తీసుకెళ్ళారు. కట్టెలు పెట్టి మల్లిక్‌ను పడుకోబెట్టి కొరివి పెట్టారు. అగ్గి పైకి లేవగానే దానితో పాటు మల్లిక్ కూడా పైకి లేచి కూర్చున్నాడు.

కిందకు దూకేశాడు. బంధువులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గ్రామస్తులైతే భయంతో పరుగులు తీశారు. విషయం అలా అలా బయటకు వెళ్ళడంతో మల్లిక్‌ను చూసేందుకు 45 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.దీనిపై మరింత చదవండి :