మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (11:02 IST)

ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ గాలి... జనరేటర్ల వాడకంపై నిషేధం

దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చలికాలం ప్రవేశిస్తూనే వాతావరణాన్ని ప్రభావితం చేసింది. ఫలితంగా ఢిల్లీలో జనరేటర్ల వినియోగంపై నిషేధం విధించారు. ఇప్పటికే దీపావళికి టపాకాసులు కా

దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చలికాలం ప్రవేశిస్తూనే వాతావరణాన్ని ప్రభావితం చేసింది. ఫలితంగా ఢిల్లీలో జనరేటర్ల వినియోగంపై నిషేధం విధించారు. ఇప్పటికే దీపావళికి టపాకాసులు కాల్చకుండా, చివరకు విక్రయించకుండా కూడా సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
సాధారణంగా చలికాలం ప్రవేశిస్తూనే ఢిల్లీ వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. పొగమంచు మహానగరాన్ని కమ్మేయగా, గాలిలో స్వచ్ఛత కనిష్టానికి పడిపోయింది. ఒక్క దీపావళి టపాకాయ కూడా పేలకుండానే ప్రమాదకరస్థాయికి గాలి చేరింది. ఇక పరిస్థితి మరింత విషమించకుండా చూసేందుకు రంగంలోకి దిగిన మునిసిపల్ అధికారులు జనరేటర్ల వాడకంపై నిషేధాన్ని ప్రకటించారు. 
 
మార్చి 15వ తేదీ వరకూ పొగమంచు కొనసాగే అవకాశాలు ఉండటంతో కార్ పూలింగ్, సరి బేసి విధానం వంటి నిర్ణయాలు కూడా తెరపైకి రానున్నాయి. గత సంవత్సరం అక్టోబరు నెలలో సాధారణ స్థాయికంటే, 14 నుంచి 16 రెట్ల అధిక కాలుష్యం నమోదుకాగా, ఈ సంవత్సరం అంతకు మించిన కాలుష్యం నమోదవుతుందని ఈపీసీఏ (ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ (ప్రివెన్షన్) అండ్ కంట్రోల్ అథారిటీ అంచనా వేస్తోంది.