మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (12:28 IST)

అమేజాన్‌‌ను ముంచేశాడు: ఫోన్లు ఆర్డర్ చేసి.. ఖాళీ బాక్సంటూ రూ.50లక్షలు గుంజేశాడు..

ఈ-కామెర్స్ సంస్థ అమేజాన్‌ను ఓ 21 ఏళ్ల కుర్రాడు భారీ ఎత్తున ముంచేశాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఖరీదైన ఫోన్లను ఆర్డరివ్వడం.. డబ్బు కట్టేసి.. ఖాళీ బాక్స్ వచ్చిందని ఫిర్యాదు చేస్తుండేవాడు. పాలసీ ప్రకా

ఈ-కామెర్స్ సంస్థ అమేజాన్‌ను ఓ 21 ఏళ్ల కుర్రాడు భారీ ఎత్తున ముంచేశాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఖరీదైన ఫోన్లను ఆర్డరివ్వడం.. డబ్బు కట్టేసి.. ఖాళీ బాక్స్ వచ్చిందని ఫిర్యాదు చేస్తుండేవాడు. పాలసీ ప్రకారం అమేజాన్ సంస్థ రిఫండ్ చేసేది. ఇలా రూ.50లక్షలు పోయాక అమేజాన్ మేలుకొంది. అంతే పోలీసులకు ఫోన్ కొట్టింది. దీంతో మోసగాడి బండారం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే, శివమ్ చోప్రా అనే ఢిల్లీ యువకుడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. అయితే నైపుణ్యం లేక ఉద్యోగం సంపాదించడంలో విఫలమయ్యాడు. ఈ సంవత్సరం మార్తిలో అతనికి ఓ ఐడియా వచ్చింది. అమేజాన్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. అమేజాన్ నుంచి యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల హైఎండ్ ఫోన్లను వేరేవేరే ఫోన్ నెంబర్లు, చిరునామాల నుంచి ఆర్డర్ ఇచ్చేవాడు. 
 
అతనికి సిమ్ కార్డులను సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్న టెలికామ్ స్టోర్ ఓనర్ సహకరించాడు. ఏకంగా 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌లను శివమ్‌కు ఇచ్చాడు. ఆపై రూ.50లక్షల వరకు అమేజాన్‌ను మోసం చేశాక సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది. అమేజాన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, శివమ్ నుంచి 19 మొబైల్ ఫోన్లు, 12 లక్షల నగదు, 40 బ్యాంక్ పాస్ బుక్ లు, చెక్కులు సీజ్ చేశారు.