శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 ఏప్రియల్ 2017 (13:45 IST)

నీకోసం ఉద్యోగం రెడీగా వుంది... విమానం ఎక్కేసి వచ్చెయ్... యువతిని తీసుకెళ్లి గదిలో 6 నెలలుగా...

కామాంధులు ఎల్లలు దాటిపోయి మరీ యువతులపై కామదాడి చేసేస్తున్నారు. యువతుల అమాయకత్వాన్ని, బలహీనతలను, ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని వారిపై లైంగిక దాడులు చేస్తున్నారు. ఇలాంటిదే ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన సోను అలియాస్ సుమి

కామాంధులు ఎల్లలు దాటిపోయి మరీ యువతులపై కామదాడి చేసేస్తున్నారు. యువతుల అమాయకత్వాన్ని, బలహీనతలను, ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని వారిపై లైంగిక దాడులు చేస్తున్నారు. ఇలాంటిదే ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన సోను అలియాస్ సుమిత్ అనే వ్యక్తికి ఫేస్ బుక్ ద్వారా ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. ఆమెతో చిట్ చాట్ చేస్తూ తను ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నానని ఆమెను నమ్మించాడు. 
 
ఆ క్రమంలో ఓ రోజు ఆమెతో... నీకోసం ఉద్యోగం రెడీగా వుంది. విమానం ఎక్కేసి వచ్చేయ్ అంటూ చెప్పాడు. దాంతో ఆమె ఎంతో సంతోషంగా తమ దేశాన్ని వీడి ఢిల్లీలో కాలు పెట్టింది. ఆమెను రిసీవ్ చేసుకున్న ఆ కామాంధుడు ఆమె పాస్‌పోర్ట్, సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తాన్ని తీసుకుని ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. ఉద్యోగం వస్తుందంటూ నమ్మబలుకుతూనే ఆమెపై లైంగిక దాడి మొదలుపెట్టాడు. ఇలా గత 6 నెలలుగా ఆమెను ఆ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగో తప్పించుకున్న సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.