శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (10:01 IST)

పీకలదాకా తాగాడు.. ఓ అమ్మాయి ఇంటికెళ్లి చేయి పట్టి లాక్కెళ్లాలని చూశాడు..

ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారిపోయింది. పీకలదాకా తాగిన యువకుడు ఓ ఇంటికెళ్లి అక్కడున్న యువతి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఢిల్లీలోని సీ బ్లాక్ సెక్టార్ 15కు చెందిన ఓ బౌన్సర్ పీకల దాకా తాగి తమ ఇంటికి వచ్చ

ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారిపోయింది. పీకలదాకా తాగిన యువకుడు ఓ ఇంటికెళ్లి అక్కడున్న యువతి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఢిల్లీలోని సీ బ్లాక్ సెక్టార్ 15కు చెందిన ఓ బౌన్సర్ పీకల దాకా తాగి తమ ఇంటికి వచ్చి తమ ఇద్దరు కూతుళ్లలో ఒకరిని పట్టుకొని ఈడ్చుకెళ్లేందుకు యత్నించాడని బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము అడ్డుకోగా ఇద్దరు కూతుళ్లను దారుణంగా కొట్టాడని ఫిర్యాదు అందిందని సెక్టారు 20 పోలీసు స్టేషను ఇన్ చార్జి అనిల్ ప్రతాప్ సింగ్ చెప్పారు. తాము కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రతాప్ సింగ్ తెలిపారు. 
 
ఇదిలా ఉంటే, రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శనివారం యాదగిరి గుట్ట పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. 108 అంబులెన్స్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లి మసీదు వద్ద ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న లియా(77)ను మసాయిపేటకు చెందిన రాజు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లియా అక్కడికక్కడే మృతి చెందగా రాజు తీవ్రంగా గాయపడ్డాడు.