గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (17:36 IST)

ప్రియుడిని చంపేసి శరీర భాగాలతో బిర్యానీ వండిన ప్రియురాలు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే నేరాలు ఘోరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. హస్తినలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాల ప్రతినిధులే గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ యువతి తన ప్రియుడుని చంపేసి శరీర భాగాలను ముక్కలు చేసి బిర్యానీ వండింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీలో అల్ అనీల్ అనే యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. కొంతకాలంపాటు ఎంతో సన్నిహితంగా మెలిగిన వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ప్రియుడుని దారుణంగా చంపేసింది. అంతేకాకుండా, అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కూరవండింది. మరికొన్ని భాగాలతో బిర్యానీ తయారు చేసి తన వర్కర్లకు వడ్డించింది. 
 
ఈ క్రమంతో తన సోదరుడు కనిపించడం లేదంటూ హతుని చెల్లి.. అల్ అనీల్ ఇంటికి వచ్చింది. ఆమెకు అక్కడ ఓ పన్ను (దంతం) కనిపించింది. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తనకంటే చిన్నవాడైన బాయ్‌ఫ్రెండ్.. తనను దూరంగా పెడుతుండటాన్ని భరించలేక ఈ దారుణానికి పాల్పడినట్టు ఆ యువతి వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఆమెను అరెస్టు చేసినట్టు ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.