మెకానిక్‌తో పడక సుఖం... హెచ్చరించాడని భర్తను చంపిన భార్య
తన ఇంటి పక్కనే ఉన్న షెడ్డులో పని చేసే మెకానిక్‌తో గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చి వివాహేతర సంబంధం భర్తకు తెలిసి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న భార్య.. తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా కరుప్పూరు ప్రాంతంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరుప్పూరు ఉప్పుకినరు అనే ప్రాంతానికి చెందిన సెల్వ కుమార్ (38) అనే వ్యక్తికి భార్య ఐశ్వర్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఐశ్వర్యకు ఇంటి పక్కనే ఓ షెడ్డులో పని చేసే మెకానిక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకుని భార్యను భర్త మందలించాడు. దీంతో ఇకపై తాను ప్రియుడుతో కలిసి శారీరక సుఖాన్ని పొందలేనని, భర్త అడ్డు తొలగించుకుంటే తామిద్దరం కలిసి జీవించవచ్చని భావించింది. ఇందుకోసం ప్రియుడు సాయం తీసుకుంది.
ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. అపుడు ఆవేశానికి లోనైన ఐశ్వర్య తన భర్త తలపై దోశ తవతో కొట్టింది. దీంతో స్పృహ కోల్పోవడంతో తన ప్రియుడు రవితో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసింది. అయితే, ఈ విషయాన్ని ఆమె నేరుగా వెళ్లి తన చిన్నాన్నకు చెప్పగా, ఆయన ఐశ్వర్యను స్టేషన్‌కు తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించాడు.