శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (14:42 IST)

జూనియర్ డాక్టర్‌ను డిన్నర్‌కు పిలిపించి.. డ్యూటీ రూమ్ తలుపులేసి?

నిర్భయ వంటి ఘటనలు సంభవించినా.. ఆ పేరుతో చట్టాలొచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. మహిళల భద్రత కోసం కఠినమైన శిక్ష అమలు చేయాలని.. ఇందుకోసం చట్ట సవరణలు చేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున

నిర్భయ వంటి ఘటనలు సంభవించినా.. ఆ పేరుతో చట్టాలొచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. మహిళల భద్రత కోసం కఠినమైన శిక్ష అమలు చేయాలని.. ఇందుకోసం చట్ట సవరణలు చేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే వుంది. తాజాగా జూనియర్ డాక్టర్‌పై ఓ సీనియర్ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని హిందూరావు ఆస్పత్రిలో గుర్‌దీప్ సింగ్ సీనియర్ డాక్టర్‌గా నాలుగేళ్ల పాటు పనిచేస్తున్నాడు. అక్కడ మెడికల్ ఇంటర్న్‌‌షిప్‌ చేసేందుకు వచ్చిన జూనియర్ డాక్టర్‌పై గుర్‌దీప్ సింగ్ కన్నుపడింది. ఆమెతో మాటలు మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు.
 
విధుల్లో వుండగానే ఆమెను డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఆపై డ్యూటీ రూమ్‌ తలుపులేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని గుర్ దీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో.. బాధితురాలికి చేసిన వైద్య పరీక్షల్లో సీనియర్ డాక్టర్ నిందితుడని తేలింది.