మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (17:42 IST)

కడుపునొప్పిగా ఉందని వెళితే... ఇలా చేస్తే పోతుందని అత్యాచారం చేశాడు...

కడుపునొప్పిగా వుందని.. డాక్టర్ వద్దకు వెళ్లకుండా.. తాంత్రికుడి వద్దకు వెళ్లింది. అంతే అదే అదనుగా తీసుకున్న తాంత్రికుడు.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు..

కడుపునొప్పిగా వుందని.. డాక్టర్ వద్దకు వెళ్లకుండా.. తాంత్రికుడి వద్దకు వెళ్లింది. అంతే అదే అదనుగా తీసుకున్న తాంత్రికుడు.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. తాంత్రికుడికి 25ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ.. తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. హత్రాస్‌కు చెందిన ఓ మహిళ గత ఏడాది జూలైలో బాబా ద్వారకాదాస్‌ను కడుపునొప్పిగా వుందని ఆశ్రయించింది.
 
కడుపునొప్పిని తగ్గిస్తానని చెప్పిన ఆయన రాత్రి పది గంటల తర్వాత ప్రత్యేక పూజలంటూ నమ్మబలికి.. దీపం ఆరిపోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని వేధించి, అత్యాచారం చేయడంతో చెడు భూతాలను తరిమేస్తున్నట్లు తెలిపాడు. తాను తలపెట్టిన అత్యాచారం కూడా నిబు పూజలో భాగమన్నాడు. అంగీకరించని పక్షంలో కుటుంబం మొత్తం మరణిస్తారని బెదిరించి యువతిని లొంగదీసుకున్నాడు. 
 
కానీ బాధితురాలు జరిగిందంతా భర్తకు చెప్పడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి వివేకానంద శరణ్ త్రిపాఠి, బాధితురాలు అత్యాచారానికి గురైన మాట వాస్తవమేనని తేల్చారు. దోషికి 25 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధిస్తున్నానని, దాన్ని చెల్లించని పక్షంలో మరో 27 నెలలు జైలు శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చారు.