బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (10:09 IST)

ప్రేమికుల మధ్య శృంగారం అత్యాచారం కిందకు రాదు : హైకోర్టు

పరస్పర ఆమోదంతో ప్రేమికులు శారీరకంగా కలుసుకున్నట్టయితే అది అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గోవాకు చెందిన చెఫ్ యోగేష్ పాలేకర్ తన సహ ఉద్యోగిని అయిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు.

పరస్పర ఆమోదంతో ప్రేమికులు శారీరకంగా కలుసుకున్నట్టయితే అది అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గోవాకు చెందిన చెఫ్ యోగేష్ పాలేకర్ తన సహ ఉద్యోగిని అయిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యోగేష్ తన సహ ఉద్యోగిని అయిన మహిళను తన ఇంట్లో వారికి పరిచయం చేసేందుకు ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రేయసి ఆ రాత్రి ప్రియుడు యోగేష్ ఇంట్లోని బస చేసింది. దీంతో ప్రియుడు రాత్రివేళ ప్రియురాలిపై మూడు సార్లు లైంగిక చర్యలో పాల్గొన్నాడు. 
 
మరుసటిరోజు ఉదయాన్ని ప్రియురాలని ఆమె ఇంట్లోనే వదిలిపెట్టాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రేయసి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై యోగేష్ అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన గోవా కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విదించింది. 
 
దీనిపై యోగేష్ హైకోర్టులో అప్పీలు చేయగా ప్రేయసితో యోగేష్ ప్రేమలో పడ్డాడని, ఆమెకు ఆర్థికంగా కూడా సాయం చేశాడని అందువల్ల పరస్పర ఆమోదంతో లైంగిక చర్యలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని కోర్టు తీర్పు చెప్పింది. పైగా, యోగేష్‌పై నమోదైన రేప్ కేసును కోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.