శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (14:51 IST)

ఢిల్లీ మెట్రో స్టేషన్‌ స్టోర్‌ రూమ్‌లో మహిళ ఉరి... రేప్ చేసి హత్య చేశారా?

ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. అదీ నిరంతరం రద్దీగా ఉండే ఈ స్టేషన్‌లోని స్టోర్‌లో ఓ మహిళ శవమై కనిపించడం సంచలనంగా మారింది. ఈమెను ఎవరైనా రేప్ చేసి ఆపై హత్య చేసి స్

ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. అదీ నిరంతరం రద్దీగా ఉండే ఈ స్టేషన్‌లోని స్టోర్‌లో ఓ మహిళ శవమై కనిపించడం సంచలనంగా మారింది. ఈమెను ఎవరైనా రేప్ చేసి ఆపై హత్య చేసి స్టోర్‌ రూమ్‌లో ఉన్న పైపుకు ఉరి వేలాడతీశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 
 
ఢిల్లీలోని కాశ్మీరు గేట్ మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నెం.2 వద్ద ఉన్న స్టోర్ రూమ్‌లోకి గురువారం ఉదయం విధులకు వచ్చిన ఓ స్వీపర్ వెళ్ళాడు. ఆయన తలుపులు తీయగానే కళ్ళ ముందు ఓ 30 ఏళ్ళ యువతి స్టోర్ రూమ్‌లోని ఇనుప పైపుకు వేలాడుతూ కనిపించడంతో జడుసుకున్నాడు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బందికి విషయాన్ని తెలిపాడు. వారు హుటాహుటిన వెళ్ళి ఆ యువతిని కిందకు దించి, ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. 
 
సాధారణంగా ఖాళీగా ఉండే స్టోర్ రూమ్‌లోకి ఆమె రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రవేశించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె స్టోర్ రూమ్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె పేరు, చిరునామా వంటి వివరాలేవీ తెలియడం లేదు. ఆమెను గుర్తించే వరకు మార్చురీలో భద్రపరుస్తామని పోలీసులు తెలిపారు.