బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (10:25 IST)

డేరా బాబాకు కరోనా పాజిటివ్.. కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్తే..?

డేరా బాబాకు కరోనా సోకింది. డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

జైలు శిక్ష పడిన నాటి నుంచి ఆయన రోహ్తక్‌లోని సునేరియా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఉందని చెప్పడంతో రోహ్తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్‌)లో పరీక్షలు చేయించారు. 
 
ఈ పరీక్షలో డేరాబాబాకు కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
 
జైలు శిక్ష పడిన నాటి నుంచి ఆయన రోహ్తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఉందని చెప్పడంతో రోహ్తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్‌)లో పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుంచి మెదాంత దవాఖానాకు కోవిడ్‌ పరీక్షలకు తరలించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని అధికారులు పేర్కొన్నారు.