1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (10:09 IST)

నరేంద్ర మోడీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాలి : ఆప్ నేత అశుతోష్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ వివరాలను ఢిల్లీ యూనివర్శిటీ బహిర్గతం చేయాలని ఆప్ నేత అశుతోష్ డిమాండ్ చేశారు. మోడీ డిగ్రీపై వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1978లో డిగ్రీ ఉత్తీర్ణులైనట్లు ఢిల్లీ వర్సిటీ ప్రకటించడంలో వాస్తవం లేదన్నారు. 
 
అంతేకాకుండా, ఢిల్లీ వర్శిటీ ప్రకటించిన మోడీ ప్రస్తుత మోడీ కాదనీ, రాజస్థాన్‌ 'నరేంద్ర మహావీర్‌ మోడీ' అని, గుజరాత్ 'నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ' కాదని, ఇద్దరికీ చాలా తేడా ఉందని ఎద్దేవా చేసింది. దీనికి సంబంధించి తమవద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఢిల్లీ వర్సిటీలో ప్రధాని మోడీ డిగ్రీ పూర్తిచేసినట్లు పత్రికలు ప్రచురించిన సర్టిఫికెట్‌ నకిలీదన్నారు.