ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)
Monalisa bosle got The Dairy of Manipuri film offer
అదృష్టం అనేది వుండాలి కానీ అది ఎటు నుంచి తలుపు తడుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇపుడిదే ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్ష మాలలు అమ్ముకుని మోనాలిసా అనే యువతి విషయంలో నిజమైంది. ఆమెను యూట్యూబర్లు, పలు ఛానళ్లు ఫోటోలు తీస్తూ, వీడియోలు చేస్తూ విపరీతంగా కవరేజ్ ఇచ్చాయి. దీనితో ఆమె బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా కంట్లో పడింది.
తను తీయబోయే ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో అచ్చం ఇలాంటి అమ్మాయి కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాననీ, తన చిత్రంలో పాత్రకి మోనాలిసా సరిగ్గా సరిపోతుందని ప్రకటించారు. అంతేకాదు... గురువారం ఆయన నేరుగా మోనాలిసా ఇంటికి వెళ్లి చిత్రంలో నటించేందుకు గాను ఆమెకి ఆఫర్ ఇస్తూ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.