సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జులై 2023 (19:27 IST)

దారుణం.. డీఎంకే కౌన్సిలర్ కుటుంబంతో ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

DMK councillor
DMK councillor
తమిళనాడు, నామక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన డీఎంకే కౌన్సిలర్ దేవిప్రియ తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో నామక్కల్ జిల్లా రాశిపురం 13వ వార్డు కౌన్సిలర్‌గా డీఎంకేకు చెందిన దేవిప్రియ ఎన్నిక కావడం గమనార్హం. 
 
దేవిప్రియ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఒక్కగానొక్క కూతురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దేవిప్రియ, ఆమె భర్త, కుమార్తె మృతదేహాలను వెలికితీసి పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.