బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (12:19 IST)

టీడీపీ అవిశ్వాస అస్త్రం : మద్దతు ప్రకటించిన డీఎంకే

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి తమ పార్టీ

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి తమ పార్టీ పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, గత పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఆది నుంచి సమావేశాల్లో గందరగోళం సృష్టించిందనీ ఈ దఫా కూడా అలాగే చర్చకు రాకుండా అన్నాడీఎంకే అడ్డుకునే అవకాశం ఉందని ఆయన గుర్తుచేశారు. కాగా, ఇటీవలి డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళిని టీడీపీ ఎంపీలు కలిసి మద్దతు కోరిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే విశ్వాసం తమకు ఉందని తెలుగుదేశం పార్టీ విప్ కొనకళ్ల నారాయణ రావు విశ్వాసం వ్యక్తంచేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశామని తెలిపారు. మేం కలిసిన అన్ని పార్టీల నేతలు మాకు మద్దతు ఇస్తున్నారన్నారు. 
 
ముఖ్యంగా అధికార బీజేపీలోని చాలా మంది ఎంపీలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్నారని కొనకళ్ల నారాయణ జోస్యం చెప్పారు. ఇలాంటి వారిమద్దతు కూడా తమకు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.