శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జులై 2018 (18:00 IST)

మోడీ సర్కారుపై అవిశ్వాసం : టీడీపీ ఎంపీలకు విప్ జారీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. దీంతో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు విప్ జారీ అయ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. దీంతో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు విప్ జారీ అయ్యింది.
 
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ... కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఈ చర్చలో బహిర్గతం చేసేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 
 
ఈనేపథ్యంలోనే గురువారం, శుక్రవారం సభ్యులందరూ తప్పనిసరిగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్ధించాలని టీడీపీ విప్‌ కొనకళ్ల నారాయణ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. 
 
ఇకపోతే, కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ప్రభుత్వాన్నే నిలదీస్తామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌ నాయుడులు ఢిల్లీలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేసే వాదనలను అబద్దాలుగా నిరూపిస్తామని బీజేపీ చెబుతోందని... కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజ స్వరూపాన్ని చర్చల ద్వారా మేం ప్రజలకు తెలియజేస్తామన్నారు. 
 
సభాముఖంగా మేం అడిగే ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసిన ఎంపీలు... మరి ప్రధాని ఏమి చెబుతారో చూద్దాం అన్నారు. అబద్దాలతో, ఆరోపణలతో రాష్ట్రంపై కేంద్రం నిందలు వేస్తోంది మండిపడ్డ ఎంపీలు... మేం చర్చకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నామని... ఇక సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపైనే ఉందని వారు అభిప్రాయపడ్డారు.