స్కానింగ్ సెంటర్లో నిండు గర్భిణిపై వైద్యుడి అత్యాచారయత్నం.. ఎక్కడ!?
ఓ వైద్యుడు సమాజంలో తలదించుకునే పని చేశాడు. నిండు గర్భిణి వైద్య పరీక్షల కోసం వైద్యుని వద్దకు వెళ్తే.. ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళ్యంలో
ఓ వైద్యుడు సమాజంలో తలదించుకునే పని చేశాడు. నిండు గర్భిణి వైద్య పరీక్షల కోసం వైద్యుని వద్దకు వెళ్తే.. ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళ్యంలో చోటుచేసుకుంది.
మేట్టుపాళ్యంలోని ఓ స్కానింగ్ సెంటర్‌కు వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణిపై దయానందన్ అనే డాక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు పంపారు. వివరాల్లోకి వెళితే.. తుడియలూరు వెల్లకి నరు బృందావన్ గార్డెన్ ప్రాంతానికి చెందిన డాక్టర్ దయానందన్ ఓ స్కానింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు.
బుధవారం ఆ సెంటర్‌లో వైద్య పరీక్షల నిమిత్తం ఓ గర్భిణి వెళ్లగా, ఆమెపై దయానందన్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దయానందన్‌ను అరెస్ట్ చేశారు.